ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ, వైఎస్​ఆర్ రైతు భరోసా నిధులు

నివర్ తుపానుతో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ, వైఎస్​ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్​.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మీట నొక్కి మెుత్తం రూ.1,766 కోట్లను విడుదల చేయనున్నారు.

రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ, వైఎస్​ఆర్ రైతు భరోసా నిధులు
రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ, వైఎస్​ఆర్ రైతు భరోసా నిధులు

By

Published : Dec 29, 2020, 4:15 AM IST

రైతు భరోసా కింద రాష్ట్రంలో 51.59 లక్షల రైతు కుటుంబాలకు రూ. 2వేల చొప్పున మెుత్తం రూ.1,120 కోట్లు ఖాతాల్లో జమ కానున్నాయి. పీఎం కిసాన్ మూడో విడత చెల్లింపులను ప్రధాని మోదీ ఈ నెల 25న విడుదల చేశారు. ఇప్పటికే కొందరి రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ అయ్యాయి. ఇందులో మిగిలిన వారితోపాటు కౌలు రైతులు, అటవీ హక్కు పత్రాలు(ఆర్​ఓఎఫ్​ఆర్) పొంది సాగు చేసుకుంటున్న గిరిజనులకు, అసైన్డ్​ భూములు సాగు చేసుకుంటున్న వారికి, రైతు భరోసాకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల చొప్పున చెల్లించనుంది.

రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీ

నివర్ తుపాను కారణంగా నవంబరులో 12.01 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. పంటలు నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీని మంగళవారం అందజేస్తారు. 'ఈ సొమ్మును బ్యాంకులు బాకీల కింద జమ చేసుకోకుండా రైతుల అన్​ఇన్​కమ్​బర్డ్​ ఖాతాల్లో జమ చేస్తున్నాం.. రైతులకు ఏదైనా సమస్య వస్తే 155251 నంబరుకు తెలియజేయాలి' అని ప్రభుత్వం ఒక ప్రకటనలో సూచించింది.

ఇదీ చదవండి:ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details