ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేట్ బస్సులకు అనుమతి..ఇవే నిబంధనలు

వాహనాల సామర్థ్యంతో పాటు ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుని ప్రైవేటు బస్సులు నడిపేందుకు అనుమతిస్తున్నట్లు కృష్ణా జిల్లా డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు.

govt permission in private buses
ప్రైవేట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్

By

Published : Jun 20, 2020, 3:17 PM IST

ప్రైవేట్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ క్యాబ్, ఆటోరిక్షాలకు అనుమతి ఇస్తున్నట్లు కృష్ణాజిల్లా డీటీసీ ఎస్​. వెంకటేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ... వాహనాలు నడపాలని ఆయన కోరారు.

కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రయాణికులను చేరవేసే వాహనాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందని వెంకటేశ్వరరావు తెలియజేశారు. బస్సులు, మాక్సీక్యాబ్‌, టాక్సీక్యాబ్‌, ఆటో రిక్షా, వ్యక్తిగత వాహనాలలో అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొక్యూడర్ (ఎస్ఓపీ) ప్రకారం తప్పని సరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ మార్గదర్శకాలను వివరించారు.

ఎంట్రీ లెవల్‌లో చేయవలసిన పనులు:

* ప్రతి ప్రయాణికుడిని ఉష్ణోగ్రత కోసం థర్మల్ స్కానింగ్ చేసి పరీక్షించాలి. థర్మల్ స్కానింగ్​లో అధిక ఉష్ణోగ్రతను చూపించే ప్రయాణికులను వాహనం లోపలికి అనుమతించరాదు.

* బస్సులో ఉచిత శానిటైజర్​ ఏర్పాటు చేయ్యాలి. ప్రతి ప్రయాణికుడు బస్సులోకి ప్రవేశించే ముందు శానిటైజర్‌తో చేతిని శుభ్రపరుచుకోవాలి. బస్సులో ప్రవేశద్వారం వద్ద స్థిరంగా ఉండేవిధంగా ప్రయాణికులు తమకు తాము శానిటైజింగ్ డిస్పెన్సర్‌ను చేసుకోనే విధంగా అమర్చాలి.

* ఫేస్ మాస్క్ లేని ప్రయాణికులను బస్సు లోపలికి అనుమతించకూడదు. ఫేస్ మాస్క్‌లు ప్రయాణికులకు బోర్డింగ్ పాయింట్ వద్ద లేదా బస్సు లోపల కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచాలి.

* ప్రతి ప్రయాణికుడికి ఒక సామాను మాత్రమే అనుమతించాలి.

* డ్రైవర్ తన క్యాబిన్​లో మాత్రమే ఉండాలి.. వాహనం ఆగినప్పుడు బయటకు దిగటం గాని, బయట తిరగటం గాని చేయకూడదు.

* డ్రైవర్​, ప్రయాణికుల మధ్య ఎటువంటి టచ్ పాయింట్ ఉండకూడదు. ప్రయాణికులందరూ ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి. డ్రైవర్‌తో నగదు లావాదేవీలు జరపకూడదు.

* సామాజిక దూరాన్ని పాటించే విధంగా పర్యవేక్షించాలి.

* బస్సు బయలుదేరే మార్గంలో పరిశుభ్రత, మరుగుదొడ్ల సౌకర్యాలు లేని టీ, ఆహార పదార్థాలను అందించే దాబాలు, హోటళ్లు, టీ షాపుల వద్ద వాహనాన్ని ఆపకూడదు.

* ప్రయాణికులు తినే ఆహార పదార్థాలను, నీటిని ఎవరికి వారే తీసుకొచ్చుకొనే విధంగా ప్రోత్సహించాలి.

* ప్రయాణంలో ప్రయాణికులు ఫేస్ మాస్క్ తొలగించకూడదు. ఫేస్ మాస్క్ ధరించని ప్రయాణికుడిపై తోటి ప్రయాణికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తదుపరి స్టేషన్ వద్ద దిగమని, డ్రైవర్ అభ్యర్థించాలి.

* నాన్-ఏసీ బస్సులను ఎన్-రూట్ స్టాప్‌లలో అనుమతించవచ్చు.

* ఏసీ బస్సులను నాన్‌స్టాప్ వాహనాలుగా అనుమతించవచ్చు.

* డ్రైవర్ ఆరోగ్యం తనిఖీ చేయాలి.

* ప్రతి డ్రైవర్​కు కొవిడ్ లక్షణాలు లేవని నిర్ధరించుకున్న తర్వాత మాత్రమే వాహనంలో ఎక్కడానికి అనుమతించాలి.

* డ్రైవర్ వారంలో ఒకసారి ఆరోగ్య పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి.

* కొవిడ్ వ్యాధి లక్షణాలను చూపించే ఏ డ్రైవర్ అయినా సంబంధిత పరీక్షల కోసం స్వచ్ఛందంగా హాజరుకావాలి.

* వాహనం యొక్క ఆపరేటర్లు కోవిడ్ లక్షణాలను చూపించే డ్రైవర్లను క్వారంటైన్ సెంటర్లకు వ్యాధి నిర్దరణకు పంపించాలి.

* ప్రయాణికుల జాబితాను ఉంచడం... వాహనంలో బయలుదేరే ప్రయాణికుల పేర్లు, చిరునామా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్లు మొదలైన వివరాలను నమోదు చెయ్యాలి.

* వాహనం యొక్క జాగ్రత్త తీసుకోవడం. ప్రతి ట్రిప్ చివరిలో 1% సోడియం హైపో క్లోరైట్ ద్రావణంను కలిపి వాహనంపై క్రిమిసంహారక పిచికారి చెయ్యాలి. హైపో ద్రావణంతో నిండిన 1.5 లీటర్ స్ప్రేయర్​ను వాహనంలో అందుబాటులో ఉంచాలి.

* హ్యాండ్ శానిటైజర్ బాటిల్ / డిస్పెన్సర్‌ను వాహనంలో ఉంచాలి.

* వాహనాల్లో ఏసీ సౌకర్యం 26 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ఉంచాలి.

అనుమతించని ప్రయాణికులు

* ఎంహెచ్‌ఏ మార్గదర్శకాల ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇంట్లోనే ఉండాలని సూచించాలి.

* పొడి దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడం వంటి కొవిడ్ లక్షణాలు కలిగిన ప్రయాణికులను వాహనంలో అనుమతించరాదు.

సిట్టింగ్ సామర్థ్యం

* డ్రైవర్‌తో సహా ఐదుగురు కూర్చునే సామర్థ్యంతో మ్యాక్సీ-క్యాబ్‌లు అనుమతించబడతాయి.

* డ్రైవర్‌తో సహా నలుగురు కూర్చునే సామర్థ్యంతో టాక్సీ-క్యాబ్‌లను అనుమతించబడతాయి.

* డ్రైవర్‌తో సహా ముగ్గురు కూర్చునే సామర్థ్యంతో ఆటోరిక్షాలు అనుమతించబడతాయి.

* వ్యక్తిగత వాహనాలు అనగా బైక్‌ నడిపేవారు, వెనక కూర్చొనేవారు మొత్తం ఇద్దరిని అనుమతించబడతాయి.

* కార్లలో డ్రైవరు మరో ఇద్దరు కలిపి ముగ్గురిని అనుమతిస్తారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమే వాహనాలు నడపాలని డీటీసీ కోరారు.

ఇవీ చదవండి:'కంట్రోల్ రూంలతో బోటు ప్రమాదాలను వంద శాతం అరికట్టవచ్చు'

ABOUT THE AUTHOR

...view details