వ్యాక్సినేషన్‌పై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లపై ప్రభుత్వం స్పందించింది. కొవాక్సిన్ అనేది ఉత్తేజంలేని వ్యాక్సిన్ అని, కోవిషీల్డ్ అనేది వైరల్ వెక్టార్ వ్యాక్సిన్ అని.. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించింది. ఇందులో 'సార్స్ కోవి2' వైరస్ లేదని, 'సార్స్ కోవి2' జన్యు పదార్థంలో కొంతభాగం మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ ఆర్టీపీసీఆర్కు దారితీయవని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ తరువాత ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ నిర్ధరణ అయితే, వారిలో కొవిడ్ వ్యాధి ఉనికి ఉందని అర్థమని తెలిపింది. అంతేకానీ వ్యాక్సినేషన్ కారణంగా పాజిటివ్ వచ్చినట్లు కాదని పేర్కొంది. కొవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్‌పై సామాజిక మాధ్యమాల్లోని పుకార్లు నమ్మెుద్దు: ప్రభుత్వం - కరోనా వ్యాక్సినేషన్ వార్తలు
'కొవిడ్ వ్యాక్సినేషన్ తరువాత కరోనా పాజిటివ్ వస్తే..' అనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళనా చెందవద్దని ప్రజలకు సూచించింది.

govt on social media fake news about corona vaccination