ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త మైనింగ్ విధానంపై ఎంఎస్‌టీసీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం - కొత్త మైనింగ్ విధానంపై ఎంఎస్‌టీసీతో ప్రభుత్వం తాజా వార్తలు

కొత్త మైనింగ్ విధానంపై కేంద్ర సంస్థ ఎంఎస్‌టీసీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇసుక తవ్వకంపై 13 జిల్లాలను 3 జోన్లుగా విభజిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇసుక తవ్వకం, సరఫరా సంస్థల నుంచి ఎంఎస్​టీసీ బిడ్లు ఆహ్వానించనుంది.

కొత్త మైనింగ్ విధానంపై ఎంఎస్‌టీసీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం
కొత్త మైనింగ్ విధానంపై ఎంఎస్‌టీసీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం

By

Published : Jan 4, 2021, 5:05 PM IST

Updated : Jan 4, 2021, 5:28 PM IST

నూతన మైనింగ్ విధానంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టీసీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో గనుల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇసుక రీచ్‌లలో తవ్వకాలు, రవాణా కోసం టెండర్ల నిర్వహణ బాధ్యత వంటివి పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు ఇసుక అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి 13 జిల్లాలను 3 జోన్లుగా విభజిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలను ఒక జోన్​గా వర్గీకరించారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను మరో జోన్‌గా..,నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లా, అనంతపురం జిల్లాలను ఒక జోన్​గా నిర్ణయించారు.

కొత్త మైనింగ్ విధానంపై ఎంఎస్‌టీసీతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం

ఇసుక తవ్వకం, సరఫరాకు ఆసక్తి గల సంస్థల నుంచి వేర్వేరుగా బిడ్లను ఎంఎస్​టీసీ ఆహ్వానించనుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఇసుక తవ్వకాలు చేపడతామని, ఆయా సంస్థలతోను వేర్వేరుగా ఒప్పందాలు ఉంటాయని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

Last Updated : Jan 4, 2021, 5:28 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details