మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సీ, ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరినీ.. ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణులను చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌తోపాటు పదో తరగతి బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.