Coal export: విదేశాల నుంచి రాష్ట్రానికి 31 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీ జెన్‌కో 18 లక్షలు, ఏపీ విద్యుత్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) 13 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు టెండర్లను పిలిచినట్లు తెలిపారు.
విదేశాల నుంచి 31 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి: మంత్రి పెద్దిరెడ్డి
Coal export: బొగ్గు కొరతను అధిగమించడానికి 31 లక్షల టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని.. విద్యుత్ సంస్థలు నిర్ణయించినట్లు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు టెండర్లను పిలిచినట్లు ఆయన తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
‘దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఆర్థికంగా భారం పడుతున్నా.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కోసం దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాం. థర్మల్ ప్లాంట్ల దగ్గర కనీసం 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉంటే.. ప్రస్తుతం ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. పరిశ్రమలకు విధించిన విద్యుత్ విరామాన్ని వీలైనంత త్వరలో తొలగిస్తాం’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: