ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు: సజ్జల - మంత్రి కేటీఆర్​ వ్యాఖ్యలపై సజ్జల ఘాటు విమర్శలు

Sajjala on KTR Comments: ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. కేటీఆర్‌ అయినా.. ఎవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. అయితే.. కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదని సజ్జల చెప్పారు.

Sajjala Ramakrishna Reddy on ktr comments
Sajjala Ramakrishna Reddy on ktr comments

By

Published : Apr 29, 2022, 7:11 PM IST

కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో రోడ్లు, నీరు, కరెంట్​ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ‘కేటీఆర్‌ అయినా, ఎవరైనా ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలి. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. సుమారు రూ.50-60వేల కోట్ల ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. ఏపీకి కేపిటల్‌ లేకుండానే విభజన చేశారు. విభజన తర్వాత ఐదేళ్లపాటు అభివృద్ధి జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే వైఎస్‌ హయాంలో చేపట్టారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకూ మనకూ అందరికీ తెలుసు. అధిక వర్షాల వల్లే రోడ్లు దెబ్బతిన్నాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను రాజకీయం చేయదల్చుకోలేదు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు. మొన్నటి వరకు తెలంగాణలో విద్యుత్‌ కోతలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సీఎం జగన్‌ పాలనలో తన మార్కును చూపిస్తున్నారు. దిశ చట్టంపై విమర్శలు చేస్తోన్న వారికి.. కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది’ అని సజ్జల వివరించారు.

ABOUT THE AUTHOR

...view details