తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్(hyderabad)లోని జలవిహార్(jala vihar)లో అలయ్ బలయ్(alai-babali) కార్యక్రమం సందడిగా జరుగుతోంది. హరియాణా గవర్నర్(haryana governer) దత్తాత్రేయ(dattatreya) కుమార్తె విజయలక్ష్మి(vijayalakshmi) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(vice president venkaiah naidu), గవర్నర్ తమిళిసై(telangana governer tamilisai), హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్(himachal pradesh governer rajendra vishwanath), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (janasena chief pawan kalyan), భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల(bharat biotech chairman krishna ella), భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్(bjp leader lakshman), ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు('maa' president manchi vishnu), ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(actor kota srinivas rao), తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.
అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో భాగంగా దుర్గామాత, జమ్మిచెట్టుకు వెంకయ్యనాయుడు పూజలు చేశారు. ఇందులో దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలయ్ బలయ్‌ను జరుపుతున్నారు. ప్రముఖులు హాజరైన దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ప్రముఖులకు సన్మానం..