"రెండేళ్లలో 2వేల గుండెలకు శస్త్రచికిత్సలు... ఇది గొప్ప విజయం" - world health day 2022 news
Governor: ఆంధ్ర హాస్పిటల్‌లో రెండేళ్లలో రెండు వేల మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సహలు పూర్తి చేయడంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కఠినమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు.
Governor: ఆంధ్ర హాస్పిటల్ గడిచిన ఆరేళ్లలో 2వేల మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఎంతో కఠినమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినందించారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఆంధ్ర హాస్పటల్ పని చేస్తుందని ఎండీ డాక్టర్ పి.వి.రామారావు అన్నారు. 2015 నుంచి ఇప్పటివరకు సుమారు 2,500 మందికి పైగా శస్త్ర చికిత్సలు, ఇంటర్‌వెన్షన్స్ చేశామన్నారు.
ఇదీ చదవండి: నీరు-చెట్టు పనుల విజిలెన్స్ విచారణపై హైకోర్టు స్టే