వ్యక్తిగతంగా అవహేళన చేయటం సరైన పద్ధతి కాదు: తెలంగాణ గవర్నర్ - కేసీఆర్పై తమిళసై కామెంట్స్
16:08 April 19
రాజ్యాంగ పరిధికి లోబడి గవర్నర్ విధులు
విభేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వ్యక్తిగతంగా అవహేళన చేయటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి చేసే అన్ని సిఫార్సులను గవర్నర్ ఆమోదించాలని లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిధికి లోబడి గవర్నర్ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ఏదైనా విభేదించగానే ప్రభుత్వం వివాదం చేయటం సరికాదని... అన్నింటినీ వ్యక్తిగత వ్యవహారాలకు ఆపాదించవద్దని చెప్పారు.
ప్రోటోకాల్ పాటించకపోవడం సరికాదని గవర్నర్ తమిళిసై అన్నారు. పరస్పర చర్చలు, అవగాహనతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు గవర్నర్ విందును బహిష్కరించాయని.. గవర్నర్‌ను ఒక పార్టీకి చెందిన వారిగా చూడటం సరికాదని అన్నారు. ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని.. ఒకరు తమ అభిప్రాయం చెప్పగానే విమర్శించటం సరైన పద్ధతి కాదన్నారు.
ఇదీ చదవండి: ఆ చోరీతో నాకెలాంటి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధం: మంత్రి కాకాణి