కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవ వేడుకలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్గా ప్రారంభించారు. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి, స్పేస్ శాస్త్రవేత్త బాల కృష్ణన్, వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యావేత్తలు పాల్గొన్నారు. యూనివర్సిటీలో ఉన్న కోర్సులను, సాధించిన విజయాల్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యావేత్తలు మాట్లాడుతూ.. ఉన్నత విలువలతో కూడిన జీవనానికి చదువు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. విద్యావంతులు తమ చదువును.. దేశ ప్రగతికి, అభివృద్ధికి దోహదం చేసేలా చూడాలని సూచించారు.