ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. వ్యవసాయ రంగం పురోభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా వంద శాతం అక్షరాస్యతకు కృషి చేస్తోందని వివరించారు.
'ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం' - గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ హరిచందన్ ప్రసంగం తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. పలు సంక్షేమ పథకాలు ద్వారా రైతులు, ప్రజలకు భరోసా కల్పిస్తోందని ఉద్ఘాటించారు.
గవర్నర్ బిశ్వభూషణ్
TAGGED:
గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగం