గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన ఇవాళ విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జరగనుంది. రాజ్ భవన్ దర్బార్ హాలు వేదికగా నిర్వహించే ఈ సదస్సులో ఉపకులపతులకు ఉన్నత విద్యావ్యవస్ధకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదస్సులో గవర్నర్ కులపతి హోదాలో కీలకోపన్యాసం చేయనున్నారు. ఉపకులపతులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆన్ లైన్ విధానంలోనే గవర్నర్- ఉపకులపతులతో సమావేశం అవుతుండగా...ఈసారి రాజ్ భవన్ వేదికగా పూర్తిస్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన వీసీల సదస్సు నేడు
Governor Biswabhusan Meeting With VCs: నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సదస్సు జరగనుంది. రెండేళ్ల తరువాత రాజ్ భవన్ వేదికగా పూర్తిస్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్