కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విశ్వవిద్యాలయాల కులపతి హోదాలో... ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అచార్య హేమచంద్రా రెడ్డి, ఇతర అధికారులతో విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీల్లోని తాజా పరిస్థితులను గవర్నర్ తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి సామాజిక దూరం గురించి తమతమ కుటుంబసభ్యులకు తెలిసేలా తమవంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
'కరోనా కట్టడికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి' - గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విశ్వవిద్యాలయ విద్యార్థులు కరోనా వ్యాప్తి నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. నిబంధనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ కుటుంబసభ్యులనూ ఆ దిశగా ప్రేరేపించాలని కోరారు.
విశ్వవిద్యాలయాల వీసీలు తమ పరిధిలోని కళాశాలల ద్వారా విద్యార్థులకు కరోనా నివారణపై ఈమెయిల్ విధానంలో పిలుపునివ్వాలని ఆదేశించారు. ఈ సందేశం లక్షల మందికి చేరుతుందని గవర్నర్ అశాభావం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లోని మౌళిక వసతులను ప్రస్తుత కష్టకాలంలో సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని... త్వరలోనే తాను ఈ అంశానికి సంబంధించి వర్సిటీల వీసీలతో చర్చిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే అనుమతించండి: సీఎం