Handloom: స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులూదిన చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత వస్త్రాలు చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి నాగవెంకట మోహనరావు.. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి తీసుకుంటున్న వివిధ చర్యలను వివరించారు.
చేనేత రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జీఎస్టీ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆప్కో ఛైర్మన్ విన్నవించారు. వ్యవసాయ తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న చేనేత రంగానికి జీఎస్టీ గొడ్డలిపెట్టుగా మారిందని.. కేంద్ర ప్రభుత్వం దానిని మినహాయించేలా సహకరించాలని గవర్నర్‌కు విన్నవించుకున్నారు.