ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజలంతా బాగుండాలని అమ్మవారిని ప్రార్థించా: గవర్నర్ - గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

గవర్నర్ బిశ్వభూషణ్.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ప్రజలకు దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.

Governor Bishwabhushan went Indrakeeladri

By

Published : Oct 1, 2019, 12:46 PM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి సతీ సమేతంగా వెళ్లిన గవర్నర్​కు ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం..అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని వారికి అధికారులు అందించారు. ప్రజలందరూ బాగుండాలని కనకదుర్గమ్మను కోరుకున్నట్టు గవర్నర్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details