ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Governor wishes: ప్రజల సంతోషమే.. ప్రభుత్వ విజయానికి కొలమానం: గవర్నర్​ బిశ్వభూషణ్ - ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్ భిశ్వభూషణ్

రాష్ట్ర అవతరణ దినోత్సవా(ap formation day)న్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. శుభాకాంక్షలు(Governor wishes on ap formation day) తెలిపారు. ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని.. పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

governor bishwabhushan wishes on  ap formation day
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

By

Published : Oct 31, 2021, 3:35 PM IST

Updated : Oct 31, 2021, 3:46 PM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాష్ట్ర అవతరణ దినోత్సవం(ap formation day) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు(Governor wishes on ap formation day) తెలిపారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సమృద్ధిగా సహజ వనరులను రాష్ట్రం కలిగి ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత పొట్టి శ్రీరాములును స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య శైలి భారతీయ సంప్రదాయంలో విశిష్టమైనదని గవర్నర్ పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న తీరుగానే తెలుగు భాష ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉండి అద్భుతమైన నాణ్యతకు ప్రసిద్ధి చెందిందన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వం.. అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది..అయితే ఆ సంక్షేమఫలాలు అర్హులైన ప్రతి వ్యక్తికి అందేలా చూడాలి' అని గవర్నర్​ అన్నారు. ప్రభుత్వ విజయానికి ప్రజల సంతోషమే కొలమానమని.. పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ప్రధాన లక్షణంగా ఉండాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలల్లో మరింత విజయాన్ని సాధించాలని బిశ్వభూషణ్ హరిచందన్ అకాంక్షించారు(ap formation day).

Last Updated : Oct 31, 2021, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details