ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రజా సంబంధాల మండలి చేస్తున్న కృషి అభినందనీయం: గవర్నర్​ - Public Relations Council of India 50th chapter start at vizag

ప్రజా సంబంధాలు అనేవి పరిస్ధితులకు అనుగుణంగా మారుతుంటాయని.. అత్యంత శక్తివంతమైన ఈ సాధనాన్ని తక్కువ అంచనా వేయకూడదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద అన్నారు. విశాఖలో భారత ప్రజా సంబంధాల మండలి(Public Relations Council of India) 50వ శాఖ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Governor Bishwabhushan Harichandan
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

By

Published : Sep 12, 2021, 5:07 AM IST

ప్రజా సంబంధాల నిపుణులకు విస్తృత అవకాశాలు కలిపిస్తూ.. వారి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచడంలో భారత ప్రజా సంబంధాల మండలి(Public Relations Council of India) చేస్తున్న కృషి అభినందనీయని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భారత ప్రజా సంబంధాల మండలి 50వ శాఖను విశాఖపట్నంలో ప్రారంభిస్తున్న నేపథ్యంలో గవర్నర్ బిశ్వ భూషణ్ రాజ్ భవన్ నుంచి వెబినార్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రంగంలోని వారికి.. వారి పని ప్రాంతాల్లో నైతిక ప్రమాణాలు ప్రోత్సహించడం, నిపుణుల మధ్య అనుసంధాన వేదికగా వ్యవహరించడం ద్వారా భారత ప్రజా సంబంధాల మండలి మంచి పనితీరు కనబరుస్తుందన్నారు.

ప్రజా సంబంధాలు అనేవి పరిస్ధితులకు అనుగుణంగా మారుతుంటాయని.. అత్యంత శక్తివంతమైన ఈ సాధనాన్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ సీఐ ఛైర్మన్ ఆర్ఎన్ మహాపాత్ర, తూర్పు జోన్ ఛైర్మన్, చీఫ్ మెంటార్ ఎంబి జయరామ్, పీఆర్ సీఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details