ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఆరంభం అయ్యాయి. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు దర్శించుకున్నారు. నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించికోవటం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు ఉపశమనం పొందాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని గవర్నర్ తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులను గవర్నర్ ఆదేశించారు.
Vijayawada durga temple: దుర్గమ్మ సేవలో గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు - Durga temple latest news
విజయవాడ కనకదర్గమ్మను గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు ఉపశమనం పొందాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.
![Vijayawada durga temple: దుర్గమ్మ సేవలో గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు Vijayawada durga temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13283039-169-13283039-1633579857982.jpg)
Vijayawada durga temple
Last Updated : Oct 7, 2021, 9:53 AM IST