ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'శాంతి స్థాపన దిశగా రోటరీ ఇంటర్నేషనల్ కృషి అభినందనీయం' - ap governor bishwabhushan latest news

రోటరి క్లబ్ ఆఫ్ భువనేశ్వర్ సెంట్రల్ ప్రారంభోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెబినార్ ద్వారా పాల్గొన్నారు. భవిష్యత్ కార్యకలాపాల్లో మరిన్ని విజయాలు సాధించాలని నూతన క్లబ్ సభ్యులకు సూచించారు.

governor bishwabhusahan started rotary club at bhuvaneshwa
governor bishwabhusahan started rotary club at bhuvaneshwa

By

Published : Mar 6, 2021, 2:19 PM IST

శాంతి స్దాపన కోసం రోటరీ ఇంటర్నేషనల్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రోటరీ సంస్ధ గతంలో కంటే మెరుగైన సంస్థగా వ్యవహరించగలగటం శుభ పరిణామం అన్నారు. నూతనంగా ఏర్పడిన రోటరి క్లబ్ ఆఫ్ భువనేశ్వర్ సెంట్రల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ వెబినార్ ద్వారా పాల్గొన్నారు. కొవిడ్ ఆరోగ్య సంక్షోభం, ప్రపంచ మాంద్యం, వాతావరణ నిర్లక్ష్యం, సాయుధ పోరాటం, సామాజిక అసమానతల వంటి విభిన్న అంశాల పట్ల రోటారియన్లు సున్నితంగా వ్యవహరించాలని గవర్నర్ అన్నారు. భవిష్యత్ కార్యకలాపాల్లో మరిన్ని విజయాలు సాధించాలని నూతన క్లబ్ సభ్యులకు సూచించారు.

తెలంగాణ గవర్నర్​కు శుభాకాంక్షలు..

అమెరికా ఇల్లినాయిస్​లోని మల్టీ ఎత్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ - 2020 వారి టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైనందుకు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరాజన్‌ను.. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ అభినందించారు. మహిళల హక్కులు, లింగ సమానత్వం, మహిళా సాధికారత, సమానత్వాన్ని సమర్థించడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. మరెన్నో అవార్డులను డాక్టర్ సౌందరాజన్ సాధిస్తారని గవర్నర్ హరిచందన్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

ఉక్కు బంద్ విజయవంతం..

ABOUT THE AUTHOR

...view details