మన దేశంలో ప్రజారోగ్యం అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కుంటోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి వైద్యశాఖ సూచించిన ఆరోగ్య నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమను, తమ కుటుంబసభ్యులను, తమ చుట్టూ ఉన్నవారిని రక్షించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు...
రోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందునా... వైద్య వనరులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి ఉందని గవర్నర్ అన్నారు. భాదితులకు అవసరమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు.