ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు
విజయవాడ పురపాలిక ఎన్నికల్లో గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సీవీఆర్ స్కూల్‌లో గవర్నర్ దంపతులు ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు తమకు ఇష్టమైన వ్యక్తికి ఓటేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిందని గవర్నర్ తెలిపారు.