ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇనుప తుక్కుతో అద్భుత కళాఖండాలు... శ్రీనివాస్ ప్రతిభకు గవర్నర్ ప్రశంస - Professor Padakandla Srinivas news

పదునైన ఆలోచనకు పనికిరాని పనిముట్లు ఓ ఆకారాన్నిచ్చాయి. ఆ కళాకారుడి ప్రతిభ ఇనుప తుక్కుకు కొత్త మెరుగులద్దింది. జీవం ఉట్టిపడేలా చేసిన ఆ కళాకృతులు ప్రధాని మెప్పు సైతం పొందాయి. అలా ఇనుప తుక్కుతో కొత్త ఆకృతులను సృష్టిస్తోన్న కళాకారుడు, ప్రొఫెసర్‌ పదకండ్ల శ్రీనివాస్‌ను రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు.

Governor appreciate Professor Padakandla Srinivas
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన శ్రీనివాస్‌

By

Published : Mar 30, 2021, 5:34 PM IST

ఇనుప తుక్కుతో కొత్త ఆకృతులు సృష్టిస్తోన్న కళాకారుడు, ప్రొఫెసర్‌ పదకండ్ల శ్రీనివాస్‌ను.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. జంక్‌ ఆర్టిస్టుగా శ్రీనివాస్ చూపిస్తున్న ప్రతిభను.. ఇటీవల మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. అది తెలుసుకున్న గవర్నర్‌.. శ్రీనివాస్‌ కళాకృతుల గురించి మరింత సమాచారం తెప్పించుకున్నారు.

పర్యావరణానికి హాని కాని వ్యర్థాలతో.. విభిన్న కళాకృతులు తయారు చేస్తున్న విధానాన్ని శ్రీనివాస్‌ వివరించారు. స్క్రాప్ మెటీరియల్‌ను ఉపయోగించి జంతువులు, అద్భుతమైన కళాఖండాలను ఏ విధంగా రూపొందించి, ఎక్కడెక్కడ వాటిని ఉంచారన్నది చెప్పారు. మదురై, చెన్నై, కర్నూలు, గుంటూరుల్లో ఈ ఆకృతులను ప్రజల సందర్శన కోసం ఉంచామన్నారు. ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ సృజనాత్మకతను, అతని నైపుణ్యాన్ని గవర్నర్‌ అభినందించారు. రాజ్ భవన్ ప్రాంగణంలోనూ ఈ తరహా కళాకృతులను ఏర్పాటు చేయాల్సిందిగా విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌ను.. గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details