రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లామిక్ విశ్వాసంలో బక్రీద్ పండగ ప్రముఖమైందని, ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను చేసుకుంటారని గవర్నర్ వ్యాఖ్యనించారు. ప్రజల్లో సద్భావన పెంచి వారిని దాన ధర్మాలవైపు నడిపించే ఈ పండగను ముస్లిం కుటుంబాలు ఆనందోత్సాహాలతో ఘనంగా చేసుకోవాలని ఆకాంక్షించారు.త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని సీఎం వ్యాఖ్యనించారు.
మానవత్వాన్ని పెంపొందించేదే బక్రీద్: పవన్
ముస్లిం సోదరులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి బక్రీద్ అర్థం చెబుతుందని, మనోవాంఛలు, స్వార్థం, రాగద్వేషాలను వదిలి మానవత్వాన్ని పెంపొందించుకోవాలనేదే బక్రీద్ ఆంతర్యమని పేర్కొన్నారు.
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం - Bakrid wishes
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో పాటు సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇస్లామిక్ విశ్వాసంలో బక్రీద్ పండగ ప్రముఖమైందని, ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను చేసుకుంటారని వ్యాఖ్యనించారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
ఇదీచదవండి