ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు గవర్నర్​, సీఎం జగన్​ అభినందనలు - Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్​ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ బిష్వభూషణ్, సీఎం జగన్.. నీరజ్​కు శుభాక్షాంక్షలు తెలిపారు. నీరజ్ గెలుపుతో యావత్ భారత దేశం గర్విస్తోందని ప్రసంశించారు.

టోక్యో ఒలంపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా
టోక్యో ఒలంపిక్స్​లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా

By

Published : Aug 7, 2021, 8:27 PM IST

టోక్వో ఒలింపిక్స్ జావిలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రాను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. 135 కోట్ల మంది భారతీయులు తలెత్తుకునేటట్లు చేశారని ప్రశంసించారు. ప్రపంచ ఒలింపిక్స్ అద్లెట్స్​లో భారత్​కు ఇది తొలిస్వర్ణం కాగా.. నీరజ్ చోప్రా మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

నీరజ్​ గెలుపు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది: జగన్​

జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. నీరజ్​ గెలుపు ఎనలేని సంతోషాన్ని కలిగించిందని.. ఈ ఒలంపిక్స్​లో భారత్​కు మొదటి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రాను మనసారా అభినందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. నీరజ్ గెలుపుతో యావత్ భారత దేశం గర్విస్తోందని జగన్ అన్నారు. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్​లో భారత్ మరిన్ని మెడల్స్ గెలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం గెలిచిన బజరంగ్ పునియానుకు సీఎం అభినందనలు తెలిపారు. రెస్లింగ్ పోటీలో ఆయన చూపిన తెగువ, ఆత్మస్థైర్యం కొనియాడదగినవని అని అన్నారు.


ఇదీ చదవండి...

PULICHINTALA: అర కిలోమీటర్​ దూరంలో క్రస్ట్‌ గేటు లభ్యం

ABOUT THE AUTHOR

...view details