ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంక్షేమాన్ని ప్రతి గుమ్మానికి చేరుస్తాం: బొత్స - granma chaivalayam

ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారుడి గమ్మానికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు.

బొత్స సత్యనారాయణ

By

Published : Jul 27, 2019, 5:17 PM IST

Updated : Jul 27, 2019, 5:48 PM IST

యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి.. సిబ్బంది నియామం కోసం నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారుడి గుమ్మానికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాలంటీర్ల నియామకం చేపట్టి ప్రతి 50 ఇళ్ల బాగోగులు ఎప్పటికప్పడూ పర్యవేక్షిస్తామని చెప్పారు. వీరంతా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారన్నారు.

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట
నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకే కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని బొత్స స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2 లోగా విజయవాడ కంట్రోల్​ రూం వద్ద వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం ఓ కుంభకోణమని మండిపడ్డారు. దానిపై విచారణ చేపట్టామని తెలిపారు. పూలింగ్​లో భూములు ఇచ్చిన రైతులు వాటిలో సాగు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ పనులను ఆపాలని మేం చెప్పలేదని వారే ఆపేశారని స్పష్టం చేశారు.

బొత్స సత్యనారాయణ
Last Updated : Jul 27, 2019, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details