ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అవినీతి ఉద్యోగులపై 100 రోజుల్లో క్రమశిక్షణ చర్యలు.. మార్గదర్శకాలు విడుదల - guidelines on disciplinary action

క్రమశిక్షణ చర్యలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై వందరోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వందరోజులు దాటితే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Government releases guidelines on disciplinary action
క్రమశిక్షణ చర్యలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

By

Published : Apr 18, 2021, 10:53 PM IST

అవినీతి కేసుల్లో దొరికిన ఉద్యోగులపై వందరోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్రమశిక్షణ చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం... పక్కా ఆధారాలతో దొరికిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. వందరోజులు దాటితే ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

వివిధ శాఖల ఉన్నతాధికారుల కమిటీ సిఫారసుల మేరకు ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. 1995 నుంచి 2020 వరకు 476 కేసుల్లో అవినీతి కేసులున్నాయన్న ప్రభుత్వం... మొత్తం 1,686 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

ఇవీచదవండి.

ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు

నదిలో చిక్కుకున్న ట్రాక్టర్​- జవాన్ల సాయంతో ఒడ్డుకు

ABOUT THE AUTHOR

...view details