ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఔత్సాహికులకు పూర్తిస్థాయిలో సహకరిస్తాం' - ఏపీలో ఎంఎస్​ఎంఈ కార్యకలాపాల వార్తలు

సూక్ష్మ, స్థూల, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎంఎస్​ఎంఈ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఈనెల 12వ తేదీన మత్స్య రంగంలో అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై విజయవాడలోని ఎంఎస్​ఎంఈ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Government ready support MSME In Andhra Pradesh
ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర శాఖ

By

Published : Dec 9, 2020, 4:52 PM IST

రాష్ట్రంలో సూక్ష్మ, స్థూల, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు తగిన మార్కెటింగ్‌ సౌకర్యం సమకూర్చేందుకు... తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎంఎస్​ఎంఈ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర శాఖ ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించిన తరుణంలో... కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఎంఎస్​ఎంఈ యూనిట్లను ప్రోత్సహిస్తోందని వివరించింది.

రాష్ట్రంలో ఆహార తయారీ.. మత్స్య ఉత్పత్తుల రంగాల్లో ఎక్కువ అవకాశాలున్నాయని ఎంఎస్​ఎంఈ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర ఛైర్మన్‌ దాసరి దేవరాజ్‌, అధ్యక్షుడు అట్లూరి రవికుమార్‌ తెలిపారు. ఈనెల 12వ తేదీన మత్స్య రంగంలో అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై విజయవాడలోని ఎంఎస్​ఎంఈ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 900 యూనిట్లను ఏర్పాటు చేయించాలనేది తమ లక్ష్యమని చెప్పారు.

ఇదీ చదవండీ... హంద్రీనీవా సుజల స్రవంతితో అనంతపురం జిల్లా సస్యశ్యామలం: జగన్

ABOUT THE AUTHOR

...view details