అర్చకులు, ఇమామ్లు, మౌజిన్లకు గౌరవ వేతనాలు పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కేటగిరి -1 ఆలయ అర్చకుల గౌరవ వేతనాన్ని 10 వేల నుంచి 15 వేల 625కు పెంచారు. కేటగిరి-2 ఆలయాల్లోని అర్చకులకు 5 వేల నుంచి 10 వేలకు పెంచారు. మసీదుల్లో ఇమామ్లకు గౌరవ వేతనాన్ని 5 వేల నుంచి 10 వేలకు, మౌజిన్లకు మూడు నుంచి 5 వేలకు పెంచారు. చర్చిల్లో పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, దేవాదాయ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.
అర్చకులు, ఇమామ్ల గౌరవవేతనాలు పెంచుతూ ఉత్తర్వులు - cs adityanath das latest news
అర్చకులు, ఇమామ్లు, మౌజిన్లకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, దేవాదాయ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం