CS Orders: ఈ నెల 2, 3 తేదీల్లో.. రాజధానిలో అందుబాటులో ఉండాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ అఖిల భారత సర్వీసు అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో పాటు అన్ని శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కావొద్దని సీఎస్ పేర్కొన్నారు. జిల్లాల విభజనకు సంబంధించిన కార్యాచరణ ఉండటంతో ఈ ఆదేశాలు జారీ అయినట్టు అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 4న సీఎం కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం అధికారులందరితోనూ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడే అవకాశం ఉండటంతో మోమో జారీ చేసినట్టు తెలుస్తోంది.
CS Orders: అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్ల అందుబాటులో ఉండాలి.. సీఎస్ ఉత్తర్వులు - ఉన్నతాధికారులు, కలెక్టర్ల అందుబాటులో ఉండాలని సీఎస్ ఉత్తర్వులు
CS Orders: ఈ నెల 2, 3 తేదీల్లో.. అన్ని శాఖల ఉన్నతాధికారులు రాజధానిలో అందుబాటులో ఉండాలని.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ అఖిల భారత సర్వీసు అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కావొద్దని పేర్కొన్నారు.
![CS Orders: అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్ల అందుబాటులో ఉండాలి.. సీఎస్ ఉత్తర్వులు government Orders to all IAS officers to be available on april 2nd and 3rd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14896429-1001-14896429-1648787157637.jpg)
అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్ల అందుబాటులో ఉండాలి.. సీఎస్ ఉత్తర్వులు