ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ

రాష్ట్రంలో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది. బాధితులకు నిత్యావసరాలు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Government orders for distribution of free ration to flood victims in the state
వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు

By

Published : Oct 19, 2020, 1:44 PM IST

రాష్ట్రంలో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో వారానికిపైగా సరకుల పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసింది.

ఒక్కో కుటుంబానికీ 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామ్ ఆయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. నిత్యావసర వస్తువుల పంపిణీకి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా తూర్పు, పశ్చిమ గోదావరి , కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశింంచింది. ఈ వస్తువుల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్​ను ప్రభుత్వం ఆదేశించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details