రాష్ట్ర ప్రజా సంబంధాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి ఓఎస్డీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు ఓఎస్డీగా తెలంగాణ జైళ్ల శాఖకు చెందిన సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ నుంచి డిప్యూటేషన్ పై దశరథరామిరెడ్డి రాష్ట్ర సర్వీసుల్లో చేరనున్నారు.
రెండేళ్ల కాలపరిమితితో ఆయనను తెలంగాణ నుంచి ఏపీకి డిప్యుటేషన్ పై పంపుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దశరథరామిరెడ్డి సర్వీసు రికార్డులను ఏపీ సాధారణ పరిపాలన శాఖకు పంపించాల్సిందిగా ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు.