ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

35 ఏళ్లపైబడిన వాలంటీర్లు ఔట్​.... జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశం... - ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్ల వార్తలు

గ్రామ, వార్డు వాలంటీర్లలో 18 ఏళ్ల కన్నా తక్కువ, 35 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని వెంటనే తొలగించాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయాల విభాగం కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ap government
ఏపీ ప్రభుత్వం

By

Published : Dec 8, 2020, 4:05 PM IST

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నియమితులైన గ్రామ ,వార్డు వాలంటీర్లపై వేటు వేయాలని అధికారులు నిర్ణయించారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వారిని నియమించాలని ఉత్తర్వులు ఉన్నా.. వయోపరిమితి పాటించకుండా కొన్ని చోట్ల నియమకాలు జరిగాయి. వారిని తొలగించాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయాల విభాగం కమిషనర్ జీఎస్ నవీన్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

వాలంటీర్లలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.. 35 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారు నియమితులైనట్లు గుర్తించామని నవీన్ కుమార్ తెలిపారు. దీనివల్ల అర్హత లేని వారి గౌరవ వేతనాలను చెల్లించడం సాధ్యపడటం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన వారిని వెంటనే తొలగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details