కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లితండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల విద్యాభ్యాసం ఆగకుండా చర్యలు చేపట్టాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. తల్లితండ్రులు ఇద్దరూ లేదా ఎవరో ఒకర్ని కోల్పోయిన విద్యార్ధుల తాలూకు వివరాలను సేకరిస్తోంది. వారి బాగోగులకు సంబంధించిన అంశాలపై నెలవారీ నివేదికల్ని ఇవ్వాల్సిందిగా మండల, డివిజనల్ స్థాయి విద్యా శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొవిడ్ కారణంగా 6800 మంది చిన్నారులు తల్లితండ్రులను కోల్పోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వారిలో 4033 మంది పిల్లలకు సంబంధించిన పూర్తివివరాలను సేకరించారు.
ఇందులో 1659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టుగా గుర్తించారు. అలాగే 2150 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టు తేలింది. మిగిలిన 524 మంది శిశువులుగా అధికారులు సేకరించిన వివరాల్లో వెల్లడైంది. కొవిడ్ సమయంలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచితంగానే విద్యను అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. కొవిడ్ కారణంగా ఇద్దరు తల్లితండ్రులు, లేదా ఎవరో ఒకర్ని కోల్పోయిన వారి వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో వారిని తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లో కొనసాగించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రైవేటు పాఠశాలలు అన్నీ అందించాలి..