రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్‌గా బద్వేలును ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి 10 మండలాలను తీసుకువస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు.. బద్వేలు ఉపఎన్నిక కోడ్ అమల్లోకి రావటంతో.. నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు తొడిగారు. పార్టీల ఫ్లెక్సీలను తొలగించారు.
REVENUE DIVISION: కొత్త రెవెన్యూ డివిజన్‌గా బద్వేలు..గెజిట్ నోటిఫికేషన్ జారీ
కొత్త రెవెన్యూ డివిజన్‌గా బద్వేలును ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ గెజిట్ జారీ చేసింది. ఇటీవల కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు దీనిని ఏర్పాటు చేశారు.
REVENUE DIVISION