టమోటా, ఉల్లి లాంటి వాణిజ్య పంటల ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ పంటల్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వమే విక్రయిస్తుందని ఈ మేరకు మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. వ్యవసాయ మిషన్ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన స్పష్టంచేశారు. ఉత్పత్తులు నష్ట పోకుండా శుద్ధి చేసి టమోటో పల్ప్ లాంటి కేంద్రాలనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. టమాటా, ఉల్లిలాంటి పంటలతో పాటు ఇతర వాణిజ్య పంటలకు సంబంధించి కూడా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి మోపిదేవి తెలిపారు.
హాస్టళ్లు,అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా
హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటల్ని సరఫరా చేస్తామని మంత్రి మోపిదేవి తెలిపారు. దళారీ వ్యవస్థ నివారణకు మార్కెటింగ్ శాఖ సత్వర చర్యలు చేపడుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశించిన స్థాయి కంటే అధికంగా పంట దిగుబడి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు.
వాణిజ్య పంటల ధరల నియంత్రణకు చర్యలు... మార్కెటింగ్ చేయాలని నిర్ణయం - 'వాణిజ్య పంటల ధరల నియంత్రణకు ప్రభుత్వమే మార్కెటింగ్ చేస్తుంది'
వాణిజ్య పంటల ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యనించారు. ప్రభుత్వమే మార్కెటింగ్ చేపట్టాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటల్ని హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ
ఇదీచదవండి
TAGGED:
వాణిజ్య పంటలపై మోపిదేవి