ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీఈడీ కళాశాలల్లో ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - బీఈడీ కళాశాలల్లో ఫీజులు నిర్ధరణ

రాష్ట్రంలోని వివిధ బీఈడీ కళాశాలల్లో 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఫీజును నిర్ధారించింది. రూ.10 వేల నుంచి గరిష్టంగా 15 వేల వరకూ ఫీజులు నిర్ధారిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

government issued orders on fees in bed colleges
బీఈడీ కళాశాలల్లో ఫీజులు నిర్ధరణ

By

Published : Feb 20, 2021, 9:19 PM IST

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ఫీజులను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని వివిధ బీఈడీ కళాశాలల్లో 2020-21 నుంచి 2022-23 సంవత్సరాల మధ్య ఫీజులను నిర్ధారించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు, అన్​ఎయిడెడ్ కళాశాలల్లో బీఈడీ కోర్సులకు రూ.10 వేల నుంచి గరిష్టంగా 15 వేల వరకూ ఫీజులు నిర్ధారించింది.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులోనే వార్షిక ఫీజు, ట్యూషన్ ఫీజు, తదితర ఫీజులు ఇమిడి ఉంటాయని స్పష్టం చేసింది. కళాశాలల వారీగా రాష్ట్రంలోని 374 ప్రైవేటు, అన్​ఎయిడెడ్ కళాశాలకు ఉత్తర్వులు వర్తిస్తాయని నోటిఫికేషన్​లో పేర్కొంది.

ఇదీ చూడండి:పంచాయతీ ఎన్నికలు: ఈనెల 22న ఎస్​ఈసీ మీడియా సమావేశం

ABOUT THE AUTHOR

...view details