ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ! - ఏపీలో ఆక్సిజన్ నిల్వలు

రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా..ఆక్సిజన్ నిల్వలు పెంచేందుకు..ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కేంద్రం కేటాయించిన 482 మెట్రిల్‌ టన్నుల ఆక్సిజన్‌ను........ ఇప్పటికిప్పుడు తెచ్చుకునే పరిస్థితి లేకపోయినా...నిరంతరం సరఫరా ఉండేలా జాగ్రత్త పడుతోంది. అదనంగా రవాణా ట్యాంకర్లు అందుబాటులోకి వస్తే...నిల్వ సామర్థ్యం పెంచుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Government increase oxygen reserves in ap
ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు

By

Published : Apr 27, 2021, 9:55 PM IST

Updated : Apr 28, 2021, 4:24 AM IST

ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు !

కరోనా తీవ్రత పెరుగుతున్నందున... భవిష్యత్‌లో ఎదురయ్యే గడ్డుపరిస్థితుల్ని ఎదుర్కొనేలా... ఆక్సిజన్ నిల్వలు పెంచుకునేందుకు ప్రభుత్వం.... చర్యలు చేపట్టింది. రాష్ట్ర అవసరాల కోసం ప్రస్తుతం రోజుకు 340 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు అవసరమవుతోంది. ఒడిశా నుంచి తెచ్చుకునేందుకు... ట్యాంకర్ల కొరత వేధిస్తోంది. రోజుకు వందకు పైగా మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాతో వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తోంది.

ఒడిశాలోని ఆంగుల్‌ ప్రాంతంలో... సుమారు 20వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ట్యాంకర్ల కొరత వల్ల..ఆంగుల్‌ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాష్ట్రానికి కేటాయించిన 80 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్‌ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 60 ఆక్సిజన్ ట్యాంకర్లు.. సరఫరాలో కీలకంగా మారాయి. నైట్రోజన్‌ సరఫరా చేసే.. 6 ట్యాంకర్లనూ... ఆక్సిజన్ రవాణా కోసం ప్రభుత్వం వినియోగిస్తోంది. మరికొన్ని ట్యాంకర్లు అందుబాటులోకి వస్తే..ఆక్సిజన్ కొరత లేకుండా చూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని మూతపడిన ప్లాంట్ల నుంచి కూడా ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నందున... ఆక్సిజన్‌ నిల్వల్ని పెంచేందుకు యంత్రాంగం సమాయత్తమైంది. ఆటోనగర్‌లో ఆగిపోయిన.. ఆక్సిజన్‌ తయారీ పరిశ్రమలన్నీ పునరుద్ధరించడంతో పాటు... పంపిణీ యూనిట్లను అందుబాటులోకి తేనున్నారు. జిల్లాలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగినా..కొరత లేకుండా చూస్తున్నామని అధికారులు చెబుతున్నారు.ఆక్సిజన్ నిల్వలు పక్కదారి పట్టకుండా అధికారులు నిఘా ఉంచారు.

ఇదీచదవండి: విశాఖ కేజీహెచ్​లో కరోనాతో ఏడాదిన్నర వయసు చిన్నారి మృతి

Last Updated : Apr 28, 2021, 4:24 AM IST

ABOUT THE AUTHOR

...view details