ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విత్తనాల పంపిణీ, పంటల బీమాపై ప్రభుత్వం కీలక నిర్ణయం - government decision on seed distribution latest news

రైతులకు ఆధార్ కార్డుతో ఇచ్చే రాయితీ విత్తనాల పంపిణీ, పంటల బీమా చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డుతో అమలు చేసే ఈ ప్రక్రియను.. ఇకపై రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

rbk
ఆర్బీకే

By

Published : Apr 13, 2021, 11:35 AM IST

ఆధార్ కార్డుతో అమలు చేసే రాయితీ విత్తనాల పంపిణీ, పంటల బీమా చెల్లింపును.. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతు భరోసా కేంద్రాలకు ఆధార్ అనుబంధ అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీలుగా అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.

సబ్సీడీలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలను.. రైతులకు నేరుగా అందించేందుకు ఉద్దేశించిన డీబీటీ స్కీమ్​లను రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్​లో పేర్కొంది. ఆధార్ చట్టం2016 లోని సెక్షన్ 7 ప్రకారం.. పంట బీమా, రాయితీ విత్తనాలను సైతం ఈ కేంద్రాలనుంచే అందించేందుకు నోటిఫికేషన్​ను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details