ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేసుకోవాలి : అనిల్ సింఘాల్

50 లేదా అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్ట చేసింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

anil singhal
అనిల్ సింఘాల్

By

Published : May 28, 2021, 4:23 PM IST

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 50 లేదా అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ఆస్పత్రులు.. 500 ఎల్​పీఎమ్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్​కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 100కు పైగా పడకలున్న ప్రైవేట్ ఆస్పత్రులు 1000 ఎల్​పీఎమ్ కెపాసిటీ కలిగిన ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. 50 పడకల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రులూ ప్రతి బెడ్​కు ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details