ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును నష్టాలపేరిట ప్రైవేటీకరించడం బాధాకరమని ఏపీఎన్జీవో అసోసియేషన్ వ్యాఖ్యానించింది. దీనిని కాపాడుకునేందుకు.. ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం అని ప్రకటించింది. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే... విశాఖ ఉక్కును కూడా ఎలా కొనుగోలు చేస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు నేతలు రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కును కొనుగోలు చేయాలని మాట్లాడటం సరికాదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.
విశాఖ ఉక్కు కోసం ఉద్యమించటానికి సిద్ధం.. - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీఎన్జీవో స్పందన
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని ఏపీఎన్జీవో ప్రకటించింది. దీని కోసం పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలసి రావాలని అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు కాపాడుకోవటం కోసం ఉద్యమించటానికి సిద్ధం