ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో.. జాతీయ స్థాయిలో పైక్ తిరుగుబాటు గుర్తింపు పొందిందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(governer bishwabushan harichandan) అన్నారు. భారతదేశ 75వ స్వాతంత్య్ర వేడుకను పురస్కరించుకుని.. శనివారం ఫిక్కీ((FICCI-Federation of Indian Chambers of Commerce and Industry)భువనేశ్వర్ శాఖ నిర్వహించిన వెబినార్‌లో.. వర్చువల్ విధానంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బుక్సి జగబంధు నేతృత్వంలో పైక్ తిరుగుబాటుకు దారితీసిన సంఘటనలను గవర్నర్ వివరించారు. 1997 లో ఒడిశాలోని జనతా పార్టీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు.. తాను సాంస్కృతిక శాఖ నిర్వహించానని, 8 సంవత్సరాల పాటు కొనసాగిన పైక్ తిరుగుబాటును మొదటి స్వాతంత్య్ర యుద్ధంగా గుర్తించటానికి చొరవ తీసుకున్నామని తెలిపారు.