రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని(NEELAM SAHNI) నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ అఫిడవిట్ వేశారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించరాదని మాత్రమే సుప్రీంకోర్టు(HIGH COURT) తీర్పు ఇచ్చిందన్నారు. ఆమె నియామకంలో నిబంధనల ఉల్లంఘన జరగలేదని అన్నారు.
నీలం సాహ్ని నియామకం నాటికి ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేరని వెల్లడించారు. పిటిషనర్ సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. అధికరణ 243k ప్రకారం గవర్నర్ విచక్షణ అధికారం మేరకు ఎస్ఈసీ(SEC) నియామకం జరిగిందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
SEC Neleam sahni: 'నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయండి'..హైకోర్టులో పిల్!