దుబాయ్ ఎక్స్పోలో రాష్ట్రంలో రూ.5,150 కోట్లతో పెట్టుబడులు పెట్టేలా 6 ముఖ్యమైన ఒప్పందాలు చేసుకున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఒప్పందాల ద్వారా భవిష్యత్లో 11 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని స్పష్టం చేశారు.
దుబాయ్ ఎక్స్పోలో ఆరు ఒప్పందాలు.. రూ.5,150 కోట్ల పెట్టుబడులు : మేకపాటి - ap latest news
దుబాయ్ ఎక్స్పోలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తద్వారా 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చెప్పారు.
goutham reddy in dubai expo
దుబాయ్ రోడ్ షోలో ఏపీ పెవిలియన్ ఏర్పాటు విజయవంతమైందని ఆయన వెల్లడించారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేలా వారం రోజులపాటు రోడ్ షోలు, రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమాల తరహాలో 100కు పైగా సమావేశాలు నిర్వహించామన్నారు.
ఇదీ చదవండి:AOB: గిరిజనులతో మమేకం.. భద్రతా బలగాల నృత్యం!