ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్లాబ్ రేట్లు మార్చి విద్యుత్ బిల్లులు పెరిగేలా చేశారు: గోరంట్ల - తెదేపా నేత బుచ్చయ్య చౌదరి తాజా వార్తలు

ప్రభుత్వం స్లాబు రేట్లు మార్చి విద్యుత్ బిల్లులు పెరిగేలా చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. కొత్త స్లాబ్​ల ప్రజలను దోచుకుంటున్నారని.. దీనికి సీఎం జదన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

buchaiah chowdary
buchaiah chowdary

By

Published : Jun 18, 2021, 10:49 PM IST

రాష్ట్ర ప్రభుత్వం స్లాబు రెట్లు మార్చి విద్యుత్ బిల్లులు పెరిగేలా చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. పాత స్లాబ్ కింద గ్రూప్ ఏ గా 200 యూనిట్లు, గ్రూప్ బిగా 300 యూనిట్లు, గ్రూప్ సిగా 300 యూనిట్లు ఆపై వాడకంగా ఉంటే.. కొత్త స్లాబ్ కింద గ్రూప్ ఏగా 75 యూనిట్లు, గ్రూప్ బిగా 225 యూనిట్లు, గ్రూప్ సిగా 225 యూనిట్ల వాడకంగా నిర్ణయించారని దుయ్యబట్టారు. స్లాబ్ మార్చడం వల్ల విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతాయన్నది వాస్తవమని.. దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్తు చార్జీలపై ప్రభుత్వానికి దోబూచులాటలెందుకని నిలదీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details