ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వాన్ని గవర్నర్​ ఎందుకు అడ్డుకోలేదు'

Gorantla Buchaiah Chowdary comments on ap Governor
గవర్నర్​పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

By

Published : Apr 19, 2022, 1:04 PM IST

Updated : Apr 19, 2022, 1:55 PM IST

12:58 April 19

గవర్నర్ ఉత్సవ విగ్రహంలా ఉండటం సరికాదు: గోరంట్ల

గవర్నర్​పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

అన్ని నిబంధనలను పక్కనపెట్టి పరిమితికి మించి అప్పులు చేస్తున్న ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఎందుకు అడ్డుకోవడం లేదని.. తెలుగుదేశం సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. గవర్నర్ ఉత్స విగ్రహంలా ఉండటం సరికాదంటూ బిశ్వభూషణ్​ హరిచందన్‌పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. వచ్చిన ప్రతి ఫైల్​పై గవర్నర్ గుడ్డిగా సంతకం పెట్టడం సరికాదని సూచించారు. కాగ్ నివేదికలు గవర్నర్​కి వచ్చినప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశించలేదని నిలదీశారు.

శ్రీలంక పరిస్థితులు నేడు రాష్ట్రంలోనూ కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఆర్ధిక క్రమశిక్షణ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 7లక్షల 76 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని.. సీఎం జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల ఏపీ దివాళా తీసిందని మండిపడ్డారు. ఏపీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. కేంద్రం వెంటనే ఏపీలో నెలకొన్న పరిస్థితి లపై నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమం ముసుగులో ప్రభుత్వం పేదవారిని తాగుబోతులుగా మారుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబు సీఎం అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటా: జేసీ ప్రభాకర్​రెడ్డి

Last Updated : Apr 19, 2022, 1:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details