క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం పటిష్టంగా జరగాలంటే... యువతకు పెద్దపీట వేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. పార్టీలో యువతకు పెద్దపీట అంటే వారసులు... ఉన్నవారి శిష్యులతో భర్తీ చేయడం కాదని హితవుపలికారు. పార్టీకి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచిన బీసీలు, మాదిగ ఓటుబ్యాంకు ఈసారి దూరమవడానికిగల కారణాలు విశ్లేషించి... భారీ ప్రక్షాళన జరగాలని గోరంట్ల పేర్కొన్నారు.
పార్టీలో యువతకు పెద్దపీట వేయాలి: బుచ్చయ్యచౌదరి - tdp meeting
పార్టీలో యువతకు పెద్దపీట వేయాలని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాపడ్డారు. ఓటమికి కారణాలు విశ్లేషించి... ప్రక్షాళన చేయాలని పేర్కొన్నారు.
బుచ్చయ్యచౌదరి