ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేద కుటుంబాల కోసం రూ.1300 కోట్లు విడుదల - ap latest news

లాక్​డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పొట్టకూటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. పేద కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించేందుకు గానూ 1300 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Good news for the jagan government .. Rs. 1,300 crores released
good-news-for-the-jagan-government-rs-1300-crores-released

By

Published : Apr 1, 2020, 7:05 AM IST

లాక్​డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దారిద్ర్యరేఖ దిగువన ఉన్నవారందరికీ ఆర్థికసాయం అందించేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1300 కోట్ల రూపాయల నిధుల్ని లాక్​డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సాయంగా ఇచ్చేందుకు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని పంచాయతీరాజ్ విభాగం ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలామంది పేదల జీవితాలు ఆర్థికంగా ప్రభావితం అయ్యాయని... వారిని ఆదుకునేందుకు కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించేందుకు గానూ ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కొవిడ్-19ను బయోలాజికల్ డిజాస్టర్​గా పేర్కొంటూ ఈ వ్యాధి తీవ్రత, పర్యవేక్షణ ఇతర కార్యక్రమాల కోసం 120 కోట్ల రూపాయలను రాష్ట్ర విపత్తు నిర్వహణా విభాగానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details