ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బెజవాడ దుర్గగుడి... తెరపైకి మరో వివాదం!! - బెజవాడ దుర్గగుడిలో మరో వివాదం

విజయవాడ దుర్గగుడిలో మరో వివాదం తెరపైకి వచ్చింది. దుర్గగుడి చీరల విభాగంలో జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం చేతివాటం ప్రదర్శించారు. భక్తులు ఇచ్చిన చీరలను మాయంచేసి... వేరే చీరలు పెట్టినట్లు గుర్తించారు. చీరల్లో గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించిన ఆలయ అధికారులు... దాదాపు రూ.11.6 లక్షల విలువైన చీరల్లో అవినీతి జరిగినట్లు నిర్ధరించారు. ఈ వ్యవహారంలో సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోనున్నారు.

దుర్గగుడిలో మరో వివాదం

By

Published : Oct 20, 2019, 11:47 PM IST

దుర్గగుడిలో మరో వివాదం

దుర్గామల్లేశ్వర దేవస్థానంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అమ్మవారికి భక్తులు సమర్పించే పట్టు చీరల్లో జునియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం చేతివాటం ప్రదర్శించినట్లు అధికారులు గుర్తించారు. భక్తులు సమర్పించిన ఖరీదైన పట్టు చీరల స్థానంలో... వేరే చీరలు మార్చినట్లు విచారణలో తెలినట్లు సమాచారం. అమ్మవారి చీరల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో... దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ ఆలయంలోని చీరల గోదాములో విచారణ చేపట్టారు.

దాదాపు రూ.11 లక్షల 60 వేల వరకు గోల్​మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. పట్టు చీరల విషయంలోనే కాకుండా... ముక్కల చీరలతో గుడ్డ సంచులు కుట్టించడంలోనూ సుబ్రహ్మణ్యం చేతివాటం చూపినట్లు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తప్పించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దుర్గగుడి పూర్వపు ఈవో కొటేశ్వరమ్మ వద్ద సుబ్రహ్మణ్యం సీసీగా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details