Yadadri Temple: తెలంగాణ రాష్ట్రం భువనగిరిలోని.. యాదాద్రి ఆలయ రాజగోపురాలపై ఏర్పాటు చేసేందుకు చెన్నైలో సిద్ధం చేసిన స్వర్ణ కలశాలు యాదాద్రికి చేరుకున్నాయి. 'యాడా' రూపొందించిన ప్రణాళిక ఆధారంగా ఆలయం చుట్టూ నిర్మితమైన రాజగోపురాలపై, స్వర్ణ కలశాలు, రాగి కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టనున్నారు. ఆ క్రమంలోనే వాటిని చెన్నైలో సాంకేతిక కమిటీ పర్యవేక్షణలో రూపొందించారు.
Yadadri Temple in Telangana: తుదిదశకు మహాసంప్రోక్షణ ఏర్పాట్లు.. యాదాద్రికి చేరుకున్న స్వర్ణ, రాగి కలశాలు - telangana news
Yadadri Temple: తెలంగాణ రాష్ట్రం భువనగిరిలోని.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లలో భాగంగా ఆలయ సప్తరాజగోపురాలపై ప్రతిష్టించనున్న కలశాలు చెన్నై నుంచి యాదాద్రి ప్రధానాలయానికి చేర్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్న తరుణంలో తుది మెరుగులు దిద్దే పనులను 'యాడా' చేపడుతోంది.

తుదిదశకు మహాసంప్రోక్షణ ఏర్పాట్లు.. యాదాద్రికి చేరుకున్న స్వర్ణ, రాగి కలశాలు
రాజగోపురాలతో పాటు విమానంపై పొందుపరిచేందుకు కలశాలను తీసుకువచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్న ఈ సందర్భంలో తుది మెరుగులు దిద్దే పనులను 'యాడా' చేపడుతోంది.యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ప్రధాన ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం ఏర్పాట్లలో భాగంగా ఆలయ సప్త రాజగోపురాలపై ప్రతిష్టించనున్న కలశాలను యాదాద్రి ప్రధానాలయానికి చేర్చారు.
ఇదీ చదవండి: